గ్రామ పంచాయితీలపై వైసీపీ రంగులు తొలగించాలి: ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Mar 10, 2020, 12:39 PM IST

ఏపీ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ కార్యాలయాలకు, ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 
 


హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ కార్యాలయాలకు, ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  గ్రామ పంచాయితీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగును వేశారని  గుంటూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Latest Videos

undefined

ఈ పిటిషన్‌పై   ఇరు వర్గాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు  తీర్పును రిజర్వ్ చేసింది. గ్రామ పంచాయితీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ  రంగులను వెంటనే తొలగించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

10 రోజుల్లోనే ఈ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించిన రంగులను మాత్రమే  గ్రామ పంచాయితీ కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు  వేయలని  హైకోర్టు సూచించింది.  

రాష్ట్రంలోని అన్ని  జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించి  వేరే రంగును వేసిన విషయాన్ని నివేదిక ఇవ్వాలని  హైకోర్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.  


 

click me!