ఒంగోలు సహకారశాఖాధికారి, సంగం డెయిరీ ఎండీ అరెస్ట్: విజయవాడ ఏసీబీ కార్యాలయానికి నరేంద్ర తరలింపు

By narsimha lode  |  First Published Apr 23, 2021, 10:33 AM IST

సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను, ప్రకాశం జిల్లా సహకారశాఖాధికారిని  ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. 


గుంటూరు: సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను, ప్రకాశం జిల్లా సహకారశాఖాధికారిని  ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే  దూళిపాళ నరేంద్రపై సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకొన్నాయనే నెపంతో  కేసులు నమోదు చేశారు.  ఇవాళ ఉదయం  దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఆయనను విజయవాడలోని  ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ విషయమై ఆయనను విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా సహకారశాఖాధికారి గురునాథాన్ని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.  సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కూడ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

also read:ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ : జ్యోతిర్మయికి లోకేష్ ఫోన్.. కోర్టులో చివాట్లు ఖాయం..

Latest Videos

గురునాథం గతంలో గుంటూరు  సహకార శాఖాధికారిగా పనిచేశారు. గుంటూరు నుండి ఆయనను ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. సంగం డెయిరీ కేసులోనే గురునాథాన్ని కూడ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.  విజయవాడ ఏసీబీ కార్యాలయంలో  నరేంద్ర రిమాండ్ రిపోర్టును ఏసీబీ అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నానికి ఆయనను  ఏసీబీ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.


 

click me!