మున్నేరు ఉద్ధృతి... నదీ మధ్యలో చిక్కుకున్న ఇసుక కూలీలు (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 12, 2021, 5:47 PM IST
Highlights

ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో నలుగురు ఇసుక కూలీలు చిక్కుకోగా వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. 

విజయవాడ: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఇలా వరదనీటితో ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న మున్నేరు నదిలో ఇసుక కోసం దిగిన నలుగురు నీటి ప్రవాహంలో చిక్కుపోయారు. 

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం ఆళ్లురుపాడు గ్రామ శివారులోని మున్నేరు నదిలోకి ఇసుకను లోడ్ చేయడానికి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కూలీలు రవికిరణ్(23), రాంప్రసాద్(24), ఇస్మాయిల్ (24), మనోజ్(24) దిగారు. వీరు ఇసుకను తవ్వుతుండగా ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో ఓ యంత్రంతో పాటు వీరు నదిమధ్యలో చిక్కుకుపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాపాడేవారి కోసం ఎదురుచూశారు. 

వీడియో

అయితే స్థానికులు వీరు నదిలో చిక్కుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, వత్సవాయి ఎస్సై మహాలక్ష్మణుడు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చురుకున్నారు. పోలీసులు, మండల అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నాటు పడవ సహాయంతో నది మధ్యలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

click me!