కరోనా థర్డ్ వేవ్: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు వ్యాక్సినేషన్.. జగన్ ఆదేశం

By Siva KodatiFirst Published Jul 12, 2021, 5:14 PM IST
Highlights

కరోనా వైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం ఆయన కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, పాఠశాలల పున: ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. 

కరోనా కట్టడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లల వైద్యుల నియామకం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని అన్నారు. అవసరమైన మెడిసిన్‌ను కూడా సిద్ధంగా వుంచాలని చెప్పారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు.

స్కూళ్లు తెరిచేముందే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల టీచర్లందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ అందుబాటును బట్టి డిగ్రీ విద్యార్ధులకు కూడా వ్యాక్సినేషన్ చేపట్టాలని అన్నారు. కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వ్యాక్సినేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. 

click me!