రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపించారు.
అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపించారు.
మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మరో సున్నితమైన అంశాన్ని లక్ష్యంగా చేసుకొని కుట్రకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వంసం చేసేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని ఆయన ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ విగ్రహాలు ఉన్నాయన్నారు. ఈ జిల్లాల్లో ఈ విగ్రహాలను ధ్వంసం చేయడమే కాదు ఆ నెపాన్ని వైసీపీపై నెట్టే ప్రయత్నం చేయనున్నారని ఆయన చెప్పారు.
దేవాలయాలపై దాడుల ఘటనలను రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. ఇదే తరహాలో విగ్రహాల ధ్వంసాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు.