ఎన్నికలు బహిష్కరించినా... బాబు కుట్రలు ఆపడం లేదు, నిమ్మగడ్డ వల్లే అంతా: సజ్జల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 6, 2021, 6:10 PM IST
Highlights

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మిగిలిన ఎన్నికల ప్రక్రియనే ఎస్ఈసీ కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మిగిలిన ఎన్నికల ప్రక్రియనే ఎస్ఈసీ కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.

గత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వల్లే ఈ దుస్థితి వచ్చిందని సజ్జల ఆరోపించారు. ఏదేమైనా కోర్టు తీర్పును అమలు చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి నుంచి టీడీపీ మరికొన్ని పార్టీలతో కలిసి కుట్ర చేస్తూనే వుందని సజ్జల ఆరోపించారు.

ఎన్నికలను బహిష్కరించాం అంటూనే టీడీపీ అధినేత కుట్రలకు తెరలేపుతున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. మళ్లీ కేంద్రంలో వున్న వారి భుజాలు ఎక్కాలని తాపత్రయపడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.

Also Read:పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే: హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్న నీలం సాహ్ని

జగన్ బెయిల్ రద్దు అవుతుందని బీజేపీ నేతలు ఎలా చెబుతారని.. న్యాయవ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉందా అంటూ సజ్జల మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉంటే ఏది పడితే అది మాట్లాడతారా అంటూ రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో హైకోర్టు స్టేను స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. పోలింగ్‌కు 4 వారాల ముందు ప్రకటన ఇవ్వాలని సుప్రీం తీర్పులో ఉందని ఆయన గుర్తుచేశారు.

సీఎం జగన్ ఒత్తిడికి ఎస్ఈసీ తలొగ్గారని యనమల ఆరోపించారు. ఎస్ఈసీ అంటే జగన్ అసిస్టెంట్ పోస్ట్ కాదని.. మెజారిటీ పార్టీల అభిప్రాయాలకు ఎస్ఈసీ విలువ ఇవ్వాలని రామకృష్ణుడు అన్నారు. 

click me!