రాజ్యాంగ విజయం: పరిషత్ ఎన్నికలపై హైకోర్టు 'స్టే' పై చంద్రబాబు

By narsimha lode  |  First Published Apr 6, 2021, 5:54 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు. 



అమరావతి:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు. పరిషత్ ఎన్నికలపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఈ విషయమై చంద్రబాబునాయుడు స్పందించారు. చట్ట విరుద్దంగా జరుగుతున్న ఎన్నికల బహిష్కరణ కరెక్టు అని కోర్టు తీర్పుతో రుజువైందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపుదల చేయడం రాజ్యంగ విజయం గా ఆయన పేర్కొన్నారు.

రెండు రోజుల్లో ఎన్నికలు జరగాల్సిన సమయంలో  ఎన్నికలు నిర్వహించకుండా హైకోర్టు స్టే విధించింది.  ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 2వ తేదీన  నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో  పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

Latest Videos

టీడీపీకి చెందిన కొందరు నేతలు ఈ ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.  పరిషత్ ఎన్నికల విషయమై టీడీపీ, జనసేనతో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ఎస్ఈసీ భావిస్తోంది. 
 

click me!