నాడే జరిగివుంటే.. పాలమూరు-రంగారెడ్డి పూర్తయ్యేదా: సజ్జల రామకృష్ణారెడ్డి

Siva Kodati |  
Published : Jul 16, 2021, 07:49 PM IST
నాడే జరిగివుంటే.. పాలమూరు-రంగారెడ్డి పూర్తయ్యేదా: సజ్జల రామకృష్ణారెడ్డి

సారాంశం

గెజిట్ నోటిఫికేషన్‌లో కొన్ని మార్చాల్సిన విషయాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ అపోహలు సృష్టిస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు వైఖరేంటీ అని సజ్జల ప్రశ్నించారు

కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాల విషయంలో న్యాయం ఏపీ వైపే వుందని ఆయన అన్నారు. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి వుంటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదని సజ్జల వ్యాఖ్యానించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:రాయలసీమ ఎత్తిపోతలతో వెలిగొండకు నీరు రాదు: ఏపీ సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల మరో లేఖ

తెలంగాణ దూకుడుగా వ్యవహరించినా తాము సంయమనంతోనే వున్నామని సజ్జల స్పష్టం చేశారు. గెజిట్ నోటిఫికేషన్‌లో కొన్ని మార్చాల్సిన విషయాలున్నాయని రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ అపోహలు సృష్టిస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు వైఖరేంటీ అని సజ్జల ప్రశ్నించారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించడం గొప్ప పరిణామం అని ఆయన పేర్కొన్నారు. జల జగడంలో ఇదొక ముందడుగా రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. నదీ జలాల సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?