ఏపీ: కొలిక్కిరాని కసరత్తు.. నామినేటెడ్ పదవులపై ప్రకటన వాయిదా

By Siva KodatiFirst Published Jul 16, 2021, 7:37 PM IST
Highlights

రేపు ఉదయం 11 గంటలకు నామినేటెడ్ పదవులపై ప్రకటన వెలువరిస్తామన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సామాజిక న్యాయం పాటిస్తూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. 

ఏపీలో నామినేటెడ్ పదవులపై కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. నామినేటెడ్ పదవులపై స్పష్టత రాకపోవడంతో వీటిపై ప్రకటన రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు నామినేటెడ్ పదవులపై ప్రకటన వెలువరిస్తామన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సామాజిక న్యాయం పాటిస్తూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. మహిళలకు 50 శాతం ప్రాధాన్యత కల్పిస్తామని సజ్జల వెల్లడించారు. 

Also Read:జగన్ మార్క్ డెసిషన్... నామినేటెడ్ పదవులు వీరికే?

కాగా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులో ప్రధానంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓడిపోయిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఆమంచి క్రిష్ణమోహన్, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, తోట వాణి, రౌతు సూర్యప్రకాశ రావు, దేవినేని అవినాశ్,బొప్పన భావన కుమార్,బాచిన చైతన్య వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి ఇటీవలే మరణించిన చంద్రమౌళి కుమారుడికి సైతం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 

click me!