విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైనట్లగా నాటకం ఆడి ప్రియుడితో లేచిపోయిన సాయిప్రియ ఆచూకీని కనుగొన్న పోలీసులు ఎట్టకేలకు ఆమెను బెంగళూరు నుంచి సొంతూరికి తీసుకొచ్చారు. పెళ్లి రోజున భర్త శ్రీనివాస్ కానుకగా ఇచ్చిన బంగారు గాజుల్ని విక్రయించిన సాయిప్రియ.. ఆ డబ్బుతో ప్రియుడు రవితో రెండు రోజుల పాటు జల్సాలు చేసినట్లుగా తెలుస్తోంది.
విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైనట్లగా నాటకం ఆడి ప్రియుడితో లేచిపోయిన సాయిప్రియ నెల్లూరు మీదుగా బెంగళూరుకి చేరుకుని అక్కడ బాయ్‌ఫ్రెండ్‌ని రెండో పెళ్లి చేసుకుని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కోసం ప్రభుత్వం యంత్రాంగం సముద్రాన్ని జల్లెడ పడితే సాయిప్రియ మాత్రం తాను క్షేమంగానే వున్నానని.. ప్రియుడిని పెళ్లిచేసుకున్నానని, తన కోసం వెతికితే చచ్చిపోతానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది. అయితే ఎట్టకేలకు బెంగళూరులో సాయిప్రియను ఆమె కొత్త భర్తని పట్టుకున్న పోలీసులు .. శుక్రవారం విశాఖకు తీసుకొచ్చారు.
అయితే విశాఖ పోలీస్ స్టేషన్‌లో సాయిప్రియ కొత్త డ్రామా మొదలుపెట్టినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. బంధువుల నుంచి తన ప్రాణాలకు ముప్పు వుందని ఫిర్యాదు చేసింది. దీంతో సాయిప్రియ భర్తను శనివారం స్టేషన్‌కు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. ఇదే సమయంలో మేజర్ కావడంతో సాయిప్రియ ఇష్టప్రకారం వుండేలా అవకాశం కల్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే పెళ్లి రోజున భర్త శ్రీనివాస్ కానుకగా ఇచ్చిన బంగారు గాజుల్ని విక్రయించిన సాయిప్రియ.. ఆ డబ్బుతో ప్రియుడు రవితో రెండు రోజుల పాటు జల్సాలు చేసినట్లుగా ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది.
undefined
జరిగింది ఇది :
విశాఖపట్నం ఎన్‌ఎడి జంక్షన్‌కు చెందిన శ్రీనివాసరావు, సాయిప్రియ దంపతులు సోమవారం తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో కాసేపు గడిపిన తర్వాత.. ఆ దంపతులు నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీనివాసరావు తనకు ఏదో ముఖ్యమైన మెసేజ్ వచ్చిందని నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు. అయితే ఫోన్ చూడటం పూర్తయ్యాక చూస్తే తన భార్య కనిపించలేదు. ఎంత వెతికినా ఆమె జాడ లేకపోవడంతో శ్రీనివాసరావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె నీటిలో గల్లంతు అయి ఉంటుందని భావించారు. అప్పటికే చీకటి పడిపోవడంతో పోలీసులు సరైన సోదాలు నిర్వహించలేకపోయారు. అయితే మంగళవారం ఉదయం తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి హెలికాప్టర్లు, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి రెండు పెట్రోలింగ్ నౌకలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే వారు సాయిప్రియ గురించిన ఎలాంటి ఆచూకీని కనుగొనలేకపోయారు.
ఇక, సాయిప్రియకు శ్రీనివాసరావుతో 2020 జూలై లో వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారని.. జూలై 25న తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారని పోలీసులు చెప్పారు. సోమవారం ఉదయం సింహాచలం వెళ్లి .. సాయంత్రం సరదాగా గడిపేందుకు ఆర్‌కే బీచ్‌కు వచ్చినట్టుగా శ్రీనివాసరావు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు.
బీచ్ నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రియ.. తాజాగా నెల్లూరులో ప్రత్యక్షం అయినట్లు, ఆమె నెల్లూరులో మరో యువకుడితో కలిసి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తాను బెంగళూరులో క్షేమంగానే వున్నానని.. వెతకొద్దని సాయంత్రం తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది. తాళిబొట్టుతో వున్న ఫోటోను పేరెంట్స్‌కు పంపింది సాయిప్రియ. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. రవి అనే వ్యక్తితో ఇష్టపూర్వకంగానే వెళ్లానని ఆమె చెప్పింది. తాను బతకాలని అనుకుంటున్నానని... తన కోసం వెతకొద్దని , వెతికితే ఇద్దరం చనిపోతామంటూ సాయిప్రియ మెసేజ్‌లో తెలిపింది. రవి పేరెంట్స్‌ని ఏం చేయద్దని ఆమె కోరింది.