అంతా సెట్ చేయడమంటే సినిమా సెట్ వేసినట్లు కాదు... పవన్‌కు యామినీ కౌంటర్

By sivanagaprasad kodatiFirst Published Oct 19, 2018, 11:23 AM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలో ఇంకా కరెంట్ సరఫరా లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని. 

శ్రీకాకుళం జిల్లాలో ఇంకా కరెంట్ సరఫరా లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై కవాతు అనంతరం పవన్ శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా లేదని... దయచేసి కాస్త సీరియస్‌గా పట్టించుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యామినీ ఫేస్‌బుక్ వేదికగా ఆధారాలతో సహా పవన్‌కు తెలిపారు.

‘‘ శ్రీకాకుళం తుఫానుపై రాజకీయ దాడి మొదలైందని.. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన మంత్రివర్గం మొత్తాన్ని పలాసకు మార్చి.. అక్కడి నుంచే పాలనా వ్యవహారాలు చూస్తున్నారని... ఇప్పటికీ 7 రోజులు అయ్యిందని.. కానీ తుఫానుకు ముందు రోజు నుంచే.. తిత్లీ ప్రభావాన్ని అంచనా వేస్తూ.. తగు ఆదేశాలు ఇస్తూ.. తుఫాను తీరందాటే వేళ నిద్రకూడా పోకుండా అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రతిపక్షం పత్తా లేకుండా పోయిందని యామినీ వ్యాఖ్యానించారు. ఒకరు హైదరాబాద్‌కు వెళ్లిపోయారని.. మరోకరు స్పెషల్ ఫ్లైట్‌లలో తిరుగుతూ కార్లలో కవాతులు చేసుకుంటూ తీరిగ్గా ఆరు రోజుల తర్వాత వచ్చాడు.

పవన్ అవమానించింది చంద్రబాబుని కాదు.. పగలనకా... రాత్రనకా.. దసరాలాంటి పండుగను సైతం.. పెళ్లాంబిడ్డలను వదిలి కష్టపడుతున్న వేలాది మంది సిబ్బందిని అని యామినీ అన్నారు. 30 సంవత్సరాల నుంచి ఉన్న విద్యుత్ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలం అయిపోయిందని.. 30 వేల కరెంట్ స్థంబాలు పడిపోయాయన్నారు.

తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకుని ఒక పూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా..? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33కేవీ లైన్లు, తర్వాత 11కేవీ లైన్లు సరిచెయ్యాలి. ట్రాన్స్‌ఫార్మర్ పోల్స్ కూడా పడిపోయే.. అవి నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి.

అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్‌లా అయిపోదు. ఇప్పటికే దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ రాజకీయ ప్రచారం కోసం కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి" అంటూ సాధినేని ఫైరయ్యారు. 

 

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

హోదా ఇవ్వకుంటే మీటూ తరహా ఉద్యమం: కేంద్రానికి చంద్రబాబు వార్నింగ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్

నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్

రెచ్చగొడుతున్నారు, ఊరుకోం: తిత్లీపై చంద్రబాబు ట్వీట్
 

click me!