కి‘లేడీ’.. ఒకరికి తెలియకుండా ఒకరితో మూడు పెళ్లిళ్లు... కాపురానికి రావాలంటే ఆస్తి రాసివ్వాలనడంతో..

By SumaBala BukkaFirst Published May 27, 2022, 7:12 AM IST
Highlights

ఓ మహిళ పెళ్లికూతురు అవతారం ఎత్తింది. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ముగ్గుర్ని మోసం చేసింది. చివరికి మూడో భర్తకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

నంద్యాల : నంద్యాల జిల్లా నంద్యాల మండలం mitnala గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న యువతి ఒకదానిమీద ఒకటి మూడు marriages చేసుకుంది. అయితే ఇందులో ఎవరికీ విడాకులు ఇవ్వకపోవడం విచిత్రం. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం… మిట్నాలకు చెందిన  మేరీ jacinta అలియాస్ మేరమ్మ కూతురు శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునతో మొదటి వివాహం అయ్యింది. ఆయనతో విడాకులు తీసుకోకుండా ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాస్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది. 

రెండో భర్తతో విడాకులు పొందక ముందే బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మనవాడేందుకు నిర్ణయించుకుంది. ఆయనకు కూడా రెండో వివాహం కావడంతో.. తనకు రక్షణగా ఐదు లక్షలు రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించింది. ఆయన ఫిబ్రవరి 1న.. రూ.5 లక్షలు డిపాజిట్ చేయగా..  ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో వారిద్దరికీ వివాహం అయ్యింది. అయితే శిరీష తల్లి మేరమ్మ తరచూ ఆర్ఎస్ రంగాపురం వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే కొంత ఆస్తి రాసి ఇవ్వాలని అని డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి.. శిరీష గురించి విచారించగా.. ఆమెకు ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు తెలుసుకుని ఆవాక్కయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. 

ఇదిలా ఉండగా, హర్యానాలో ఇలాంటి ఉదంతమే మార్చిలో వెలుగులోకి వచ్చింది. అందంతో వలపువల విసిరి అమాయకపు మోమూతో.. కట్టిపడేసి.. ఆ తరువాత విశ్వరూపం చూపిస్తూ.. ఏడుగురు పెళ్లికొడుకులకు చుక్కలు చూపించిందో కి‘లేడీ’. ఒకరిమీద ఒకరిని ఏకంగా మూడు నెలల్లో ఏడుగురిని పెళ్లి చేసుకుంది. అనాథలా తనను పరిచయం చేసుకోవడం.. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం.. మొదటి రాత్రి భర్తకు మత్తుమందు ఇవ్వడం… డబ్బు, నగలతో మాయమవడం..  ఇదే స్క్రిప్ట్ ను ఒకటి కాదు రెండు కాదు.. మూడు నెలల వ్యవధిలో ఏడు సార్లు ప్రయోగించింది ఆ యువతి.  ఏడుగురు పెళ్లి కుమారులను మోసగించింది.  చివరకు యువతితో పాటు ఆమె ముఠా సైతం పోలీసులకు చిక్కింది. హర్యానాకు చెందిన ఓ యువతి పెళ్లికాని యువకులను, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకునేది.  

వారికి వలపు వల విసిరి పెళ్లి వరకు తీసుకు వెళ్ళేది.  వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి మత్తుమందు మాత్రలు ఇచ్చి.. ఇంట్లో ఉన్న డబ్బు నగలతో ఉదయించేది. భర్తకు అనుమానం వచ్చేలోపే ముఠాతో కలిసి ప్రణాళికను అమలుచేసేది. ఈ పథకం అమలు కాకపోతే మరో మార్గం ఎన్నుకునేది.వరకట్నం వేధింపుల పేరుతో భర్తను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేది. తనకు తల్లిదండ్రులు లేరని అందరినీ నమ్మించేది.  ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. ఈ గ్రూపులో మ్యారేజ్ ఏజెంట్,  నలుగురు పురుషులు సహా ముగ్గురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్ ను యువతి మొదటగా పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్ళాడాడు. ఇక ఆమె రెండో పెళ్లి జనవరి 1న రాజస్థాన్ లో జరిగింది.  ఫిబ్రవరి 15న మూడో వివాహం,  ఫిబ్రవరి 21న 4 వివాహం రాజేందర్ తో జరిగింది. 5 పెళ్లి కుటానాకు చెందిన  గౌరవ్ తో… ఆరో వివాహం కర్ణాటకకు చెందిన సందీప్ తో జరిగింది.  చివరగా  మార్చి 26న బుద్వాకు చెందిన సుమిత్ తో ఆమెకు ఏడో పెళ్లి జరిగింది.  సదరు యువతిని వివాహం చేసుకున్న నాలుగో వ్యక్తి నౌల్తాకు చెందిన రాజేందర్ ఈ వ్యవహారంలో పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. 

click me!