కోనసీమ అల్లర్లు : 46 మందిపై ఎఫ్ఐఆర్.. లిస్టులో బీజేపీ నేతలు, కాపు ఉద్యమ నేత కుమారుడు

Siva Kodati |  
Published : May 26, 2022, 06:13 PM IST
కోనసీమ అల్లర్లు : 46 మందిపై ఎఫ్ఐఆర్.. లిస్టులో బీజేపీ నేతలు, కాపు ఉద్యమ నేత కుమారుడు

సారాంశం

కోనసీమ అల్లర్లకు సంబంధించి అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. దీనిలో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో బీజేపీ నేతలు, కాపు ఉద్యమ నేత కుమారుడు వున్నట్లుగా తెలుస్తోంది.  

కోనసీమ జిల్లాకు (konaseema violence) అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో (amalapuram violence) మంగళవారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలకు సంబంధించి ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, బీజేపీ నేత రాంబాబులపై కేసు పెట్టారు.

కాపు ఉద్యమనేత నల్లా సూర్య చంద్రరావు కుమారుడు అజయ్ సహా 43 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో అమలాపురంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. సామర్లకోటకు చెందిన వాసంశెట్టి సుబ్రమణ్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వజ్ర పోలీస్ వాహనం డ్రైవర్‌గా పని  చేస్తున్నారు  సుబ్రమణ్యం. 

మరోవైపు.. Amalapuram లో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదని ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి Taneti Vanita చెప్పారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆందోళనకారులు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారన్నారు. గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామంటే ఎందుకు అడ్డుకోవాలన్నారు. అందుకే జేఏసీ నేతలను కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా హోం మంత్రి గుర్తు చేశారు. 

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ Konaseema జిల్లా పెట్టాలని ఆందోళనలు సాగిన సమయంలో TDP, Jana Sena నేతలు ఈ ఆందోళనలకు మద్దతు పలికారా లేదా అని మంత్రి వనిత ప్రశ్నించారు. ఈ విషయమై ధర్నాలు,  నిరహార దీక్షలు ఎవరూ చేశారో కూడా అందరికీ తెలుసునన్నారు.  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చిన తర్వాత పార్టీలు మాట మార్చాయని ఆమె విమర్శించారు.

ALso Read:అమలాపురంలో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదు: ఏపీ హోం మంత్రి తానేటి వనిత

కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని పార్టీలు స్పష్టం చేయాలని ఆమె కోరారు. అమలాపురం విధ్వంసం వెనుక అసాంఘిక శక్తులున్నాయన్నారు.  ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని పన్నాగం పన్నారని హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు. 

రాళ్ల దాడి జరుగుతున్నా ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు సంయమనం పాటించారని మంత్రి గుర్తు చేశారు. ఆందోళనకారులను అక్కడి నుండి పంపే ప్రయత్నం చేశారని మంత్రి వివరించారు. అన్యం సాయి జనసేన నేతే  అవునో కాదో చెప్పాలన్నారు. అమలాపురం విధ్వంసానికి పాల్పడిన వారిలో 70 మందిని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని మంత్రి వివరించారు. అమలాపురంలో విధ్వంసం వెనుక ఎవరున్నారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారి నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్