
మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి గెలవగానే త్వరలో చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని విస్తరించేయోచనలో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం బాగా జరుగుతోంది.
నెటిజన్లే మంత్రివర్గంలో చేరబోయే వారి పేర్లు, మంత్రివర్గంలో నుండి తప్పించబోయే పేర్లంటూ ఊదరగొడుతున్నారు. కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావును తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో దూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, బోండా ఉమ, బుచ్చయ్య చౌదరి, అనితల పేర్లు పరిశీలనలో ఉన్నాయని కుడా ప్రచారం మొదలైంది.
అసలు మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబైతే ఇంతవరకూ ఎక్కడా సూచనప్రాయంగా కుడా సంకేతాలు ఇవ్వలేదు. పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం. ఎప్పటి నుండో మంత్రులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇక, రాబోయేదంతా ఎన్నికల సీజనే. పోయినసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో బయటపడిన అసంతృప్తుల సంగతి అందరికీ తెలిసిందే కదా?
అప్పట్లో బుచ్చయ్య చౌదరి, దూళిపాళ, బోండా, కాగిత వెంకట్రావు, అనిత, బండారు సత్యనారాయాణమూర్తి, గౌతు శివాజి తదితరులు చంద్రబాబుపై బాహాటంగానే తిరుగుబాటు లేవనెత్తినంత పనిచేసారు. దాంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది. సరే, తర్వాత అందరినీ దారిలోకి తెచ్చుకున్నారనుకోండి అది వేరే సంగతి.
అప్పట్లోనే అంత అసంతృప్తి వ్యక్తం చేసిన వారు ఎన్నికలకు ముందు చేపడుతున్న చివరి మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఏం చేస్తారో? పైగా మంత్రివర్గం నుండి తప్పించిన వారు ఊరుకుంటారా? కాబట్టి మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే వరకూ ఎవరి ఊహాగానాలకు వారు పదును పెట్టుకోవ