తిరుమలలో పొంచివున్న ప్రమాదం : హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీజీఎస్

First Published Jun 1, 2018, 6:08 PM IST
Highlights

భక్తులు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుపాట్లు ప్రజల ప్రానాలను బలితీసుకుంటాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ఈ పిడుపాట్ల కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రతత్గా ఉండాలని, ఈ పిడుగుపాట్ల నుండి ప్రజలను కాపాడటానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో బాగంగా ముందస్తుగానే ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉందో తెలుసుకుని అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇలా తిరుమ‌ల‌ పరిసరాల్లో పిడుగులు పడుతాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో టీటీడీ అధికారులతో పాటు జిల్లా అధికారులను ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేసింది. తిరుమల కొండపై, పరిసర ప్రాంతాల్లోని భక్తులు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పక్కా భవనాల్లోను, టిటిడి భవనాల్లోను తలదాచుకోవడం వల్ల ఈ పిడుగుపాట్ల నుండి రక్షణ పొందొచ్చని భక్తులకు సూచించారు.
 
ఏపీలో పిడుగుపాటును ముందే పసిగట్టే టెక్నాలజీ ఉంది. అమెరికా ఎర్త్ నెట్ నుంచి ఈ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో అరగంట ముందే తెలుసుకోవచ్చు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను ముందే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడంతో పాటు అధికారులను అప్రమత్తం చేయవచ్చు. ఈ విధంగా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి టెక్నాలజీని ఏపిలోనే ఏర్పాటు చేశారు. దీని వల్ల ఇప్పటికే పలు జిల్లాలో భారీగా నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు, ప్రాణ నష్టం జరక్కుండా చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.  
 

click me!