దాసరి, చిరంజీవి ఇక్కడ పుట్టినవాళ్ళే: వైఎస్ జగన్

First Published Jun 1, 2018, 5:58 PM IST
Highlights

బాబుపై జగన్ హాట్ కామెంట్స్

పాలకొల్లు:  బిజెపితో కాపురం చేసే వరకు ప్రత్యేక హోదా అనే అంశం చంద్రబాబునాయుడుకు గుర్తు లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు.ఎన్నికల కోసమే బాబు హోదాపై యూటర్న్ తీసుకొన్నారన్నారు. 


పాలకొల్లు సినీ, నాటకరంగానికి ప్రసిద్ది చెందిందని ఆయన చెప్పారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహరావు లాంటి వాళ్ళంతా పాలకొల్లులో పుట్టినవారేనని జగన్ గుర్తు చేశారు.  వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చేరుకొంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.పశ్చిమగోదావరి జిల్లాలోని 15 ఎమ్మెల్యే స్థానాల్లో టిడిపి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈ జిల్లాకు చంద్రబాబునాయుడు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు.


పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలకు దోపిడిలో చంద్రబాబునాయుడు ట్రైనింగ్ ఇచ్చారని వైసీపీ ఆయన విమర్శలు గుప్పించారు.పాలకొల్లులో  స్థానిక టిడిపి నేతలు తారాస్థాయికి చేరుకొందన్నారు.బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డెల్టాలో కరువు నెలకొందన్నారు.  వంతులవారీగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. దిగుబడి కూడ పూర్తిగా పడిపోయిందన్నారు.

మార్కెట్లో పంటలకు మద్దతు ధర దొరకడం లేదన్నారు.ఆక్వారంగం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. డెల్టా కాలువలను వైఎస్ఆర్ హాయంలో చేపట్టారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆ పనులు నిలిచిపోయాయని చెప్పారు.గోదావరి పుష్కరాలతో పాటు ప్రతి పథకంలో కూడ అవినీతికి పాల్పడుతున్నారని టిడిపి నేతలపై జగన్ విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం ఫ్లాట్లు ఇస్తే తీసుకోవాలని కోరారు. ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పించే రుణాలను  వైసీపీ అధికారంలోకి వస్తే  ఆ రుణాలను రద్దు చేస్తామని జగన్ చెప్పారు.

 

తన కార్యక్రమం లైవ్ రాకుండా  స్థానిక ఎమ్మెల్యే విద్యుత్ సరఫరా చేయించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఫీజులు కొంత మేరకు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు..

 

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బాబు డ్రామాలు, కొత్త సినిమాలు చూపిస్తున్నారు. నిరుద్యోగ భృతి అంటూ ముందుకు వచ్చారు.ప్రతి కుటుంబానికి 96 వేల బాకీ ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కోటి 70 లక్షల నిరుద్యోగుల సంఖ్యను 10 లక్షలకు తగ్గించారని జగన్  బాబుపై విమర్శలు గుప్పించారు.



చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు  తనకు ప్రజలు సహకరించాలని జగన్ కోరారు.ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కేజీ బంగారం, బెంజీ కారు ఇస్తానని కూడ బాబు బూటకపు వాగ్దానాలను ఇచ్చే ప్రమాదం ఉందని జగన్ ఆరోపించారు.

 

 

click me!