ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

Published : Oct 13, 2018, 04:44 PM IST
ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

సారాంశం

ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. 

కడప జిల్లాలో శనివారం ఓ పెను ప్రమాదం తప్పింది.  కడప జిల్లా రాయచోటి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంబేపల్లి మండలం దేవపట్ల బస్ స్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.  ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. ప్రయాణికులందరూ కిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు మాత్రం సగానికి పైగా కాలిపోయింది.  అసలు మంటలు చెలరేగానికి మాత్రం కారణం తెలియరాలేదు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్