శ్రీకాళహస్తిలో కీచక బస్ డ్రైవర్.. ఆరో తరగతి బాలికతో అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి లైంగిక వేధింపులు..

Published : Apr 01, 2023, 01:02 PM IST
శ్రీకాళహస్తిలో కీచక బస్ డ్రైవర్.. ఆరో తరగతి బాలికతో అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి లైంగిక వేధింపులు..

సారాంశం

ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆరో తరగతి చిన్నారి మీద కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వాటిని ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. 

తిరుపతి : కన్నూమిన్నూ కానని కామంతో.. వయసు తారతమ్యం లేకుండా ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో బస్సు డ్రైవర్. ఈ ఘటన శ్రీకాళహస్తిలో వెలుగు చూసింది. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, జనసేన నాయకులతో కలిసి ఆ డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. ఆ తరువాత పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. 

బుచ్చినాయుడు కండ్రిగలో ఓ బాలి ఆరో తరగతి చదువుతోంది. స్కూలుకు వెళ్లే క్రమంలో ప్రతీరోజు శ్రీకాళహస్తికి ఆర్టీసీ బస్సులోనే వెడుతోంది. కాగా గత 12 రోజులుగా శ్రీనివాసులు అనే బస్సు డ్రైవర్ ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి.. వాటిని ఫొటోలు తీశాడు. మొదటిరోజు ఆమెను లైంగికంగా వేధించాక.. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ ఫొటోలు చూపిస్తే అందరూ నిన్నే తిడతారు అని భయపెట్టాడు.

వివాహితతో సహజీవనం, నిత్యం మద్యం తాగి వేధింపులు.. గొంతుకోసి చంపిన ప్రియురాలు..

దీంతో తీవ్రంగా భయపడిన చిన్నారి ఎవ్వరికీ చెప్పలేదు. ఆ తరువాత ప్రతీరోజూ అదే తంతు కొనసాగించడంతో భయాందోళనలతో నాలుగైదు రోజులు స్కూలుకు కూడా వెళ్లలేదు. దీంతో తల్లిదండ్రులు అనుమానంతో స్కూలుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా.. ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్థానిక జనసేన నాయకులతో కలిసి.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు.

అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వాటిని ఫొటోలు తీసి ఆమెను లైంగిక వేధిస్తున్నాడు.మొదటి రోజు బాలికకు బలవంతంగా ముద్దులు పెడుతూ.. ఫొటోలు తీసి వాటిని స్కూల్లో అందరికి చూపిస్తానని వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ డ్రైవర్ కు దేహశుద్ధి చేసిన తరువాత పోలీసులకు అప్పజెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్