సాఫ్ట్‌వేర్ మార్చి శ్రీశైలం దేవాలయంలో కోట్లు స్వాహా: ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఈవో

By narsimha lode  |  First Published May 25, 2020, 12:22 PM IST

శ్రీశైలం దేవాలయంలో సాఫ్ట్ వేర్ ను మార్చేసి కొందరు ఉద్యోగులు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టుగా ఈవో కేఎస్ రామారావు చెప్పారు. అవినీతి జరిగిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.



శ్రీశైలం:శ్రీశైలం దేవాలయంలో సాఫ్ట్ వేర్ ను మార్చేసి కొందరు ఉద్యోగులు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టుగా ఈవో కేఎస్ రామారావు చెప్పారు. అవినీతి జరిగిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.

శ్రీశైల మల్లన్న దర్శనం కోసం రూ. 150 టిక్కెట్ల కొనుగోలులో రూ. 1.80 కోట్లు మాయమైనట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. రూ. 1500 అభిషేకం టిక్కెట్లలో రూ. 50 లక్షలు మాయమయ్యాయి. భక్తులు ఇచ్చిన విరాళాల్లో సుమారు కోటి రూపాయాలు  అక్రమార్కుల పాలయ్యాయి. అదే విధంగా భక్తులకు ఇచ్చిన అకామిడేషన్లకు సంబంధించి విషయాల్లో కూడ రూ. 50 లక్షలు మాయమయ్యాయి.

Latest Videos

also read:భూముల విక్రయాన్ని నిలిపివేయండి: టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి బోర్డు సభ్యుడు రాకేష్ సిన్హా లేఖ

500 టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టిక్కెట్లలో కూడ రూ. 50 లక్షలు మాయమైనట్టుగా ఈవో తెలిపారు. ఒక్కొక్క అవినీతి బయటపడడంతో ఉద్యోగులు పరస్పరం ఈవోకు ఫిర్యాదు చేశారు. 

ఆలయంలో అవినీతి జరిగిందని ఈవో కేఎస్ రామారావు చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన ప్రకటించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన విరాళాలే కాదు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన ఆదాయం కూడ అక్రమార్కుల జేబుల్లోకి చేరింది.

లాక్ డౌన్ దెబ్బకు ఆలయానికి భారీగా ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపుల విషయంలో పాలక మండలి ఇబ్బందులు పడుతోంది. అయితే దేవాలయ ఆదాయాన్ని అక్రమార్కులు తమ జేబుల్లోకి మళ్లించుకొన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. 

click me!