
శ్రీకాకుళం: జిల్లాలోని నరసన్నపేటలో రూ. 500 కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. నరసన్నపేట లోట్ ప్లాజా సమీపంలో టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై రూ. 500 కరెన్సీ నోట్లు పడిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. టోల్ ప్లాజా గుండా వెళ్లిన ఆటో నుండి రూ. 500 కరెన్సీ నోట్లు రోడ్డుపై పడిపోయినట్టుగా టోల్ ప్లాజా సిబ్బది చెబుతున్నారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆటో ను టోల్ ప్లాజా సిబ్బంది వెంబడించారు. అయినా ఆటో దొరకలేదు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ తరుణంలో కరెన్సీ నోట్లు రోడ్డుపై పడిపోవడం కలకం రేపుతుంది.
టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై పడిపోయిన కరెన్సీని టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు అప్పగించారు. రోడ్డుపై సుమారు రూ. 80 వేల కరెన్సీని టోల్ ప్లాజా సిబ్బంది సేకరించి పోలీసులకు అప్పగించారు. ఈ ఆటో ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడకు వెళ్లిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ ఆటో ఎవరిదనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.