AP politics Roundup 2021: పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్.. ‘రిపబ్లిక్‌’తో మొదలు.. మాటల తూటాలు

By Mahesh K  |  First Published Dec 16, 2021, 1:14 PM IST

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోసానీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ దుమారం రేపింది. సినిమా పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎత్తి చూపుతూ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. మీడియా మొదలు వైసీపీ ప్రభుత్వం వరకు విరుచుకుపడ్డారు. దీనిపై సినీ రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ పవన్‌పై కౌంటర్ అటాక్‌కు దిగారు. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలతో రగిలిపోయిన పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పోసానీ కృష్ణ మురళీపై విరుచుకుపడ్డారు.
 


అమరావతి: ఈ ఏడాది Andhra Pradesh రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. టీడీపీ, వైసీపీలతోపాటు జనసేన రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో YCPపై సంచలన వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్‌గా పోసాని కృష్ణ మురళీ మాటలు పేల్చడం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. వైసీపీ నేతల కౌంటర్‌ల కంటే కూడా పోసాని మాటలు, ప్రెస్ మీట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఏడాది(Year Roundup 2021) మరికొన్ని రోజుల్లో ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఆ ఎపిసోడ్‌ను ఓ సారి మననం చేసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై చర్యలు తీసుకోవడం.. ముఖ్యం టికెట్ రేట్లు, సర్కారు జోక్యం వంటి విషయాలు కలకలం రేపాయి. అదీ Janasena అధినేత Pawan Kalyanనటించిన వకీల్ సాబ్ విడుదల సమయంలో జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమపై నియంత్రణ చేసే నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ అటు సినీ నటుడు కావడం, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Latest Videos

undefined

Also Read: పవన్‌పై వ్యాఖ్యలు: పోసానిపై జనసైనికుల ఆగ్రహం.. పంజాగుట్ట పీఎస్ వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు

తనపై అక్కసుతో చిత్ర పరిశ్రమపై ప్రతీకారం తీర్చుకోవద్దని, అవసరం అయితే, తన సినిమాను నిలిపేసుకోండని ఆ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకానీ, చిత్ర పరిశ్రమపై చర్యలు తీసుకోవద్దని ఏపీ సర్కారును కోరారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఇంకా చికిత్స పొందుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ.. మీడియానూ విమర్శించారు. సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ స్టోరీలు నడపడం కాదు.. కోడి కత్తి గురించి, ఇడుపుల పాయ గురించి, వైఎస్ వివేకా హత్య గురించి రాయాలని హితవు పలికారు. సినిమా పరిశ్రమలోని వారు కోట్లకు కోట్లు తీసకుంటున్నారని ఆరోపణలు చేయడం కాదు.. వాళ్లు ఎంటర్‌టైన్ చేస్తున్నారు కాబట్టే ప్రతిఫలం తీసుకుంటున్నారని, ప్రజా సొమ్మును దోచుకోవడం లేదని ఆరోపణలు చేశారు. మంత్రి పేర్ని నానిని పరోక్షంగా సన్నాసి అని సంభోదిస్తూ విమర్శలు చేశారు. కులం ప్రస్తావనలూ చేసి దుమారం రేపారు.

వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన తర్వాత సనీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందినవారే కావడం గమనార్హం. జగన్‌తో నీవు పోల్చుకోలేవని పోసాని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై కౌంటర్ అటాక్‌కు పెట్టిన ప్రెస్ మీట్‌లో ఆయన ‘పంజాబీ అమ్మాయి’ ప్రస్తావన చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరాలనే ఆశతో వచ్చిన ఓ పంజాబీ అమ్మాయిని పవన్ కళ్యాణ్ మోసం చేశాడని, నోరు విప్పితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడని ఆరోపణలు చేశారు. అంతేకాదు, రూ. 5 కోట్లు ఇచ్చి నోరు మూయించాడని ఆరోపించారు. ఆమెకు న్యాయం చేస్తే తానే స్వయంగా పవన్‌కు గుడి కడతారని అన్నారు. లేదంటే ఆయనకు ఎవరినీ ప్రశ్నించే హక్కు ఉండదని తెలిపారు

Also Read: పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడి: పోలీసుల దర్యాప్తు

పవన్ కళ్యాణ్‌పై పోసానీ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. ‘జస్టిస్ ఫర్ పంజాబీ అమ్మాయి’ ట్రెండ్ అయింది. అయితే, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పోసానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోసాని కృష్ణ మురళీ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, తన కుటుంబంలోని ఆడవాళ్లపై దూషణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది సిగ్గు చేటు అని, దాడులకూ వెనుకాడటం లేదని అన్నారు. నాయకులే దాడి చేస్తాం.. బట్టలూడదీసి కొడతాం అంటూ మాట్లాడితే వారి అనుచరులు అదే దారిలో నడుస్తారు అని విమర్శించారు. ‘నీకు నీ కుటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబం అంతే గొప్ప’ అని చెప్పారు.

పవన్‌పై విమర్శలు చేశాక.. వేల మెస్సెజీలు, ఫోన్ కాల్స్ బెదిరింపులు వస్తున్నాయని పోసాని చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే ఆయనే ఫ్యాన్స్‌తో ఇలా టార్గెట్ చేయిస్తున్నాడని ఆరోపించారు. విమర్శలు తట్టుకోలేని ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. మరోసారి ఆయన పంజాబీ అమ్మాయిని ప్రస్తావించారు. ఎన్నికల్లో ఓడిపోయాక పవన్ సైకోలా మారాడని, ఎవరు ఏమన్నా ఫ్యాన్స్‌తో బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఆడవారికి ఇచ్చే గౌరవం గురించి పవన్‌కు తెలియదని, పుల్లకు చీర కట్టినా ఆ పిల్ల ఎవరు అని ఎత్తి చూసే రకం అంటూ ఆరోపణలు చేశారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత పోసానిపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఇంకా పెరిగింది. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాని ముందే జనసేన కార్యకర్తలు వీరంగం చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వ నియంత్రణ అంశంతో వపన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో దుమారం రేగినా.. ఇప్పుడు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై కేసు కోర్టులో ఉన్నది. ప్రభుత్వ జీవోపై మధ్యంతరంగా నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.

click me!