తిరుమలలో గదులు దొరుకుతాయో.. ఇకపై భక్తులకు ఆ టెన్షన్ వద్దు, ఎస్ఎంఎస్‌తో కష్టాలకు చెక్

By Siva KodatiFirst Published Jun 10, 2021, 6:03 PM IST
Highlights

అద్దె గదుల విషయమై సాధారణ భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు గాను కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు

తిరుమల వెళ్లే ప్రతిఒక్కరికి స్వామివారి దర్శనం కంటే ముందు అక్కడ గదులు దొరుకుతాయో లేదోనన్న భయం ఎక్కువ. దేశం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో తరలివచ్చేవారికి తిరుమలలో వసతి అంత సులభంగా దొరకదు. అందుకే ఈ టెన్షన్. ఈ నేపథ్యంలో అద్దె గదుల విషయమై సాధారణ భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు గాను కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

Also Read:హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ వాదనతో ఏకీభవించడంలేదు: గోవిందానంద సరస్వతి

సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. ఈ శనివారం ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను టీటీడీ అధికారులు ప్రారంభించనున్నారు.  
 

click me!