ఏపీ: కరోనా కేసుల్లో భారీ తగ్గుదల.. ఆ రెండు జిల్లాల్లోనే అధిక తీవ్రత

Siva Kodati |  
Published : Jun 10, 2021, 05:11 PM IST
ఏపీ: కరోనా కేసుల్లో భారీ తగ్గుదల.. ఆ రెండు జిల్లాల్లోనే అధిక తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,110 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,87,883కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,110 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,87,883కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,763కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 7, అనంతపురం 4, తూర్పుగోదావరి 6, చిత్తూరు 11, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 1, కృష్ణ 4, విశాఖపట్నం 7, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 9, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 12,981 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,77,063కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 97,863 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,01,37,627కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 99,057 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 906, చిత్తూరు 1042, తూర్పుగోదావరి 1416, గుంటూరు 512, కడప 508, కృష్ణ 576, కర్నూలు 235, నెల్లూరు 280, ప్రకాశం 600, శ్రీకాకుళం 461, విశాఖపట్నం 502, విజయనగరం 280, పశ్చిమ గోదావరిలలో 792 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu