
విజయవాడ: అధికార వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో నిన్న(సోమవారం) అర్దరాత్రి దొంగలుపడ్డాయి. కృష్ణా జిల్లా పెడనలోని ఆయన నివాసంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దోపిడి జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి చొరబడ్డు దొంగలు దాదాపు రూ.18లక్షల మేర నగదు దోచుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.
దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ దోపిడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.