నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీచోరీ...కోటిన్నర సొమ్ముతో క్యాషియర్ పరారీ

Arun Kumar P   | Asianet News
Published : Jun 04, 2020, 11:35 AM ISTUpdated : Jun 04, 2020, 11:39 AM IST
నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీచోరీ...కోటిన్నర సొమ్ముతో క్యాషియర్ పరారీ

సారాంశం

నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. 

విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ స్కామ్ బయటపడింది. ఇదే బ్యాంక్ లో హెడ్ క్యాషియర్ గా పనిచేస్తున్న రవితేజ చేతివాటం ప్రదర్శించారు. బ్యాంక్ లోని రూ.1.56 కోట్ల ఖాతాదారుల సొమ్మును కొట్టేశాడు. 

ఆన్లైన్ రమ్మీ, క్యాసినో ఆటకు అలవాటు పడ్డ రవితేజ భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తాను పనిచేస్తున్న బ్యాంక్ కే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఖాతాదారులు జమచేసిన కోటిన్నర నగదును తీసుకుని ఉడాయించాడు. 

read more   ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం... తల్లి మృతి, చిన్నారులు సేఫ్

క్యాషియర్ బ్యాంక్ సొత్తుతో ఉడాయించినట్లు తెలుసుకున్న అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న రవితేజ కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు