నిన్న సచివాలయం, నేడు విద్యుత్ సౌధ... ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం

By Arun Kumar PFirst Published Jun 4, 2020, 10:31 AM IST
Highlights

విజయవాడ గుణదల విద్యుత్ సౌద కార్యాలయ సమూహంలోని జోనల్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే సచివాలయం ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా ఓ విద్యుత్ సౌద ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. దీంతో ఆ కార్యాలయంలో పనిచేసే విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో కలవరం మొదలయ్యింది. 

విజయవాడ గుణదల విద్యుత్ సౌద కార్యాలయ సమూహంలోని జోనల్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో అతనితో పాటు ఉద్యోగం చేస్తున్న 22 మంది సిబ్బందిని హోమ్ క్వారంటయిన్ లో ఉండాలని అధికారుల ఆదేశించారు. 

అయితే ఈ చర్యలతో సరిపెట్టుకోవద్దని... కార్యాలయంలో మిగిలిన ఉద్యోగులందరికి టెస్ట్ లు నిర్వహించాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయం అంతా శానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని మరియు భౌతిగా దూరం పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కార్యాలయంలో సుమారు 500 మంది ఇంజినీర్లు,  మరియు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని...అధికారులు స్పందించి భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. 

read more  ఏపి సచివాలయంలో కలకలం... హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగికి కరోనా

ఏపిలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారి వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే ఏపీలో 180 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. 

ఇతర రాష్ట్రాల నంచి వచ్చినవారిలో 94 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి కరోనా వైరస్ వచ్చినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 68 మంది మరణించారు. 

ఏపీలో 967 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 2224 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3279కి చేరుకుంది. బుధవారం 8,066 శాంపిల్స్ ను పరీక్షించగా 79 మందికి మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 35 మంది  కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 119 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసుల్లో 118 యాక్టివ్ గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 573 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వీరిలో 362 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


 

click me!