తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయంలోకి చోరీకి యత్నం.. రాత్రంతా లోపలే నక్కిన దొంగ

By Siva KodatiFirst Published Mar 27, 2021, 2:27 PM IST
Highlights

తిరుపతిలోని ప్రఖ్యాత గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు గోవిందరాజస్వామి ఆలయాన్ని పరిశీలించారు. విష్ణు నివాసంలో సీసీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలించారు.

తిరుపతిలోని ప్రఖ్యాత గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు గోవిందరాజస్వామి ఆలయాన్ని పరిశీలించారు.

విష్ణు నివాసంలో సీసీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలించారు.  రెండు హుండీల్లో చోరీకి ప్రయత్నించినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌ల్లో కనిపించింది. రాత్రి ఆలయం మూసేసిన తర్వాత దుండగుడు చొరబడినట్లు అనుమానిస్తున్నారు.

ఉదయం ఆలయం తెరిచేసరికి చిందరవందరగా సామాగ్రి పడివుండటంతో దొంగతనం జరిగినట్లుగా అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీఎస్ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ.. సీసీ ఫుటేజ్‌లో దొంగను గుర్తించామన్నారు.

ఎలాంటి వస్తువులు చోరీ కాలేదని.. రాత్రంతా ఓ వ్యక్తి లోపలే ఉన్నాడని ఆయన తెలిపారు. ధ్వజస్తంభం వద్ద దొంగతనానికి యత్నించాడని సీసీఎస్ డీఎస్పీ చెప్పారు.

తాళాలు తెరిచేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదని ఆయన పేర్కొన్నారు. ఉదయం భక్తులతో కలిసి వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని.. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుంటామని సీసీఎస్ డీఎస్పీ వెల్లడించారు. 

click me!