దొడ్డిదారిలో అసెంబ్లీకి వెళ్తూ అడ్డదారుల్లో పాలన : జగన్ మీద డోలా ఫైర్

By AN TeluguFirst Published Mar 27, 2021, 1:33 PM IST
Highlights

దొడ్డిదారిలో అసెంబ్లీకి వెళ్తూ అడ్డదారుల్లో పాలన సాగిస్తూ.. ఆర్డినెన్స్ సీఎంగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని టీడీపీ నేత డోలా వీరాంజనేయ స్వామి విరుచుకుపడ్డారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఆర్డినెన్స్ ను సాధారణ పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకుంటూ.. రెండేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆర్డినెన్స్ లు ఇచ్చిన సీఎంగా జగన్ రెడ్డి నిలిచారని ఎద్దేవా చేశారు. 

దొడ్డిదారిలో అసెంబ్లీకి వెళ్తూ అడ్డదారుల్లో పాలన సాగిస్తూ.. ఆర్డినెన్స్ సీఎంగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని టీడీపీ నేత డోలా వీరాంజనేయ స్వామి విరుచుకుపడ్డారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఆర్డినెన్స్ ను సాధారణ పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకుంటూ.. రెండేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆర్డినెన్స్ లు ఇచ్చిన సీఎంగా జగన్ రెడ్డి నిలిచారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల దిశ దశను నిర్ణయించే బడ్జెట్ ను కూడా ఆర్డినెన్స్ రూపంలో ఆమోదింప జేసుకోవడం రాజకీయ దిగజారుడు తనానినికి నిదర్శనమన్నారు. 

ఆర్డినెన్స్ లేకుండా ప్రజామోదంతో నిర్ణయం తీసుకునే ధైర్యం జగన్ రెడ్డికి లేదా.? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లు నుండి ఎన్నికల కమిషనర్ ను మార్చడం వరకు.. అన్నింటినీ ఆర్డినెన్స్ రూపంలో దొడ్డిదారిన ఆమోదించుకున్నారు. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదింపజేసుకోవడం దేనికి సంకేతం.? అని మండిపడ్డారు.

పక్కనున్న తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలూ జరుగుతున్నాయి. అక్కడ లేని అడ్డంకి ఇక్కడెందుకొచ్చింది.? అడ్డదారికి అలవాటు పడి.. అసెంబ్లీకి వెళ్లడం నుండి.. విద్యుత్, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సహా.. చివరికి బడ్జెట్ ఆమోదించుకోవడానికి కూడా అడ్డదారినే వాడుతున్నారన్నారు.

సంఖ్యాబలం ఉందని.. అడ్డగోలు నిర్ణయాలు, అసంపూర్ణ బడ్జెట్ తో రాష్ట్ర భవిష్యత్తును అధోగతిపాల్జేస్తున్నారు. అసంపూర్ణ పాలనకు జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ గా మారారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నింటినీ అసంపూర్ణంగా నిలిపేశారన్నారు.

అన్న క్యాంటీన్లను నాశనం చేసి.. ప్రజల్ని ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించడంపై ఉన్న శ్రద్ధ.. బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై లేదా.? బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదు.? ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు సమాధాన చెప్పాలని డిమాండ్ చేశారు.  

బడ్జెట్ సమావేశాలు జరిగితే.. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై నిలదీస్తాయి.. వారికి సమాధానం చెప్పే ధైర్యం లేక, మోసాలు బట్టబయలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో సమావేశాలు పెట్టకుండా.. తప్పించుకోవడానికి ఆర్డినెన్స్ ను వాడుకుంటున్నారు. ఇప్పటికైనా అడ్డదారిని వీడండి. ధైర్యంగా ప్రజలకు సమాధానం చెప్పండి. లేకుంటే మిమ్మల్ని అదే అడ్డదారిలో పులివెందులకు తరిమేస్తారని గుర్తుంచుకోండి అని హెచ్చరించారు. 
 

click me!