కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

By Siva KodatiFirst Published May 11, 2019, 6:36 PM IST
Highlights

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెల్దుర్ది దగ్గర వోల్వోబస్, బైక్, తుఫాన్ ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది వరకు మరణించగా, పలువురు గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వెల్దుర్ది క్రాస్ వద్ద తుఫాన్ వాహనాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది.

బైకును తప్పించే క్రమంలోనే అత్యంత వేగంగా వస్తున్న వోల్వో బస్సు తొలుత ద్విచక్ర వాహనాన్ని అనంతరం తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తుఫాను వాహనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా గద్వాల జల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారు.

వీరు పెళ్లి చూపులకు వెళ్లీ. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. క్షతగాత్రులకు అత్యున్నత స్థాయి వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

అటు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సైతం మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
 

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

click me!