ఏపీలో ఫ్యాను గాలి.. వైసీపీకీ 120, టీడీపీకి 40: లక్ష్మీపార్వతి జోస్యం

By Siva KodatiFirst Published May 11, 2019, 4:52 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని.. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం చేశారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి.

గుంటూరులో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని.. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం చేశారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. టీడీపీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలను పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు.

ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్ధను నాశనం చేసి ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు కూడా ఇవ్వలేని స్ధితికి రాష్ట్రాన్ని తెచ్చారని లక్ష్మీపార్వాతి ఆరోపించారు. స్పెషల్ విమానాలకు ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు ప్రజలకు వెన్నుపోటు వరకు చంద్రబాబుకు ప్రజాతీర్పులో శిక్ష తప్పదని లక్ష్మీపార్వతి శపించారు. ప్రస్తుత ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించిరావని ఆమె జోస్యం చెప్పారు. 

click me!