అర్థరాత్రి ఇన్నోవా, టమాటా లారీ ఢీ.. నలుగురు మృతి..

Published : Aug 07, 2021, 10:51 AM IST
అర్థరాత్రి ఇన్నోవా, టమాటా లారీ ఢీ.. నలుగురు మృతి..

సారాంశం

ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపకి వివాహానికి వస్తున్నారు. మరోవైపు చిత్తూరు నుంచి టమాటాల లోడుతో మినీ లారీ వెడుతోంది. 

కడప : మైదుకూరు-బద్వేలు జాతీయ రహదారి డి. అగ్రమారం వద్ద శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 

ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపకి వివాహానికి వస్తున్నారు. మరోవైపు చిత్తూరు నుంచి టమాటాల లోడుతో మినీ లారీ వెడుతోంది. 

డి.అగ్రహారం వద్ద స్పీడ్‌ బ్రేకర్లున్నాయి. ఇది గమనించుకోని కారణంగా ఇన్నోవా, లారీ ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను, మృతదేమాలను బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?