వివాహేతర సంబంధం : తనతో కాకుండా మరొకరితో... వివాహిత గొంతుకోసిన ప్రియుడు...

By AN Telugu  |  First Published Aug 7, 2021, 9:51 AM IST

పది నెలలుగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె తనతో సరిగా ఉండటం లేదని అనుమానం వచ్చిన సాగర్ బాబు విచారించగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. 


వివాహేతర సంబంధం నేపత్యంలో వివాహిత గొంతుకోసి యువకుడు తాను కూడా గొంతు కోసుకున్న ఘటన శుక్రవారం గుంటూరులో సంచలనం రేకెత్తించింది. గాయపడ్డ ఇద్దరూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు నిర్థారించారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిదరం చెందిన మహిళ (40) భర్త అనారోగ్యంతో అయిదేళ్ల క్రితం మృతి చెందారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంది. అమరావతి మండలం ఎండ్రాయికి చెందిన అవివాహితుడు బండి సాగర్ బాబు (28)కు ఏడాది క్రితం ఆటోలో ఆమె పరిచయమయ్యింది.

Latest Videos

పది నెలలుగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె తనతో సరిగా ఉండటం లేదని అనుమానం వచ్చిన సాగర్ బాబు విచారించగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. హెచ్చరించినా ఆమె లెక్క చేయకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి తనకు చిక్కాడని, మర్యాదగా చెప్పినట్లు నడుచుకుని గుంటూరుకు రాకపోతే చంపుతానని బెదిరించాడు.

పులిచింతలలో కొట్టుకుపోయిన గేటు.. అంతా వైఎస్ వల్లే: చంద్రబాబు సంచలన ఆరోపణలు

దీంతో ఆమె శుక్రవారం ఉదయం గుంటూరుకు వచ్చింది. బ్రాడీపేటలోని గోల్డెన్ పార్కు హోటల్ లో గది అద్దెకు తీసుకుని అక్కడకు రావాలని కోరాడు. ఆమె హోటల్ కు వచ్చాక ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన ఎందుకు మార్చుకోవడం లేదని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సాగర్ బాబు వెంట తెచ్చుకున్న కత్తితో మహిళ గొంతు కోశాడు. 

ఊహించని ఈ పరిణామానికి ఆమె పెద్దగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది తలుపులు బాదారు. తలుపులు తీయకుండా సాగర్ బాబు తాను కూడా గొంతు కోసుకున్నాడు. హోటల్ 108 కు, పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దర్నీ అంబులెన్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు నుంచి అరండల్ పేట సీఐ నరేష్ కుమార్ వివరాలు రాబట్టారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు నిర్థారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!