తాడిపత్రి: 20మంది కూలీలతో వెళుతుండగా యాక్సిడెంట్... ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

By Arun Kumar P  |  First Published Nov 7, 2021, 10:00 AM IST

20మంది కూలీలలో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 


అనంతపురం: పొట్టకూటికోసం కూలీ పనులకు వెళుతున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 20మంది కూలీలతో ఆదివారం తెల్లవారుజామునే బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి బోల్తాపడిన దుర్ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... tadipatri పట్టణం నుండి బ్రాహ్మణపల్లి గ్రామానికి ఇవాళ ఉదయం 20మంది కూలీలలో ఓ వాహనం బయలుదేరింది. అయితే మార్గమద్యలో చుక్కలూరు క్రాస్  రోడ్డు వద్ద ఈ వాహనం ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగి అదుపుతప్పిన వాహనం బోల్తా పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 18మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Latest Videos

undefined

read more  తిరుపతిలో కారు బీభత్సం, బైకులు ధ్వంసం.. ఇంటికి వెళ్లకుండానే ప్రమాదానికి గురైన కొత్తకారు

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చూసారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు కూలీల పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

ఘటనాస్థలంలోని మృతదేహాలను కూడా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. అనంతరం ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘోర రోడ్డుప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమయి వుంటుందని అనుమానిస్తున్నారు.

రోడ్డు ప్రమాదానికి గురయిన తెలంగాణ పోలీసులు

ఇక ఇవాళ  తెల్లవారుజామున విధినిర్వహణలో భాగంగా ఓ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు వెళుతుండగా పోలీస్ వాహనంలో ప్రయాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో వాహనంలోని నలుగురు పోలీసులు గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 
 
భూపాలపల్లి ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం గ్రామానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఉదయం పొగమంచు కారణంగా పోలీస్ వాహనాన్ని నడుపుతున్న కానిస్టేబుల్ రోడ్డుపక్కన ఆగివున్న ఇసుక లారీని గుర్తించలేకపోయాడు. దీంతో వేగంగా వెళ్లిన పోలీస్ వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడ్డ పోలీసులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అందరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ధ్వంసమయ్యింది. 

read more  YS Sharmila: 108కి ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అంబులెన్స్ రాకపోవడంతో పాదయాత్రకు సంబంధించిన అంబులెన్స్‌లోనే..

వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమవడంతో తెల్లవారుజామున పొగమంచు కురవడం కూడా ఆరంభయ్యింది. దీంతో తెల్లవారుజామున ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు కమమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. అలాగే రోడ్డు మలుపులు కూడా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. 

దీంతో అత్యవసరం అయితేతప్ప అర్ధరాత్రులు, తెల్లవారుజాముల్లో ప్రమాణాలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు ధ్వంసమవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రభుత్వాలు కూడా వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నిలువరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

 

 

 

 
 

click me!