ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 215 మందికి పాజిటివ్.. 20,65,026కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Nov 06, 2021, 06:59 PM IST
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 215 మందికి పాజిటివ్.. 20,65,026కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 215 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 406 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,568 మంది చికిత్స పొందుతున్నారు.   

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 215 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,65,026కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,392కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒక్కొరు మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 406 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,47,066కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 30,831 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,97,06,769కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,568 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 33, తూర్పుగోదావరి 26, గుంటూరు 24, కడప 11, కృష్ణ 37, కర్నూలు 1, నెల్లూరు 17, ప్రకాశం 12, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 27, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 10 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?