నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టి, ఈడ్చుకెళ్లిన లారీ, ముగ్గురి మృతి..

By SumaBala BukkaFirst Published Feb 17, 2022, 8:55 AM IST
Highlights

నెల్లూరులో గతరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టి.. కొద్దిదూరం అలాగే లాక్కెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా ముగ్గురు మృతి చెందారు. 

చిల్లకూరు : nellore జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద బుధవారం రాత్రి ఘోర road accident జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న autoను..  వరగలి క్రాస్ రోడ్డు వద్ద చింతవరం వస్తున్న lorry ఢీకొంది. అప్పటికీ ఆగకుండా ఆటోను లాక్కుంటూ కొద్ది దూరం వెళ్ళింది.  ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా…  గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ సుధాకర్ (50) అందులోనే ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. మిగిలిన ఇద్దరూ లారీ చక్రాల కింద పడి తనువు చాలించారు. 

వీరిని గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగీ రాజశేఖర్ (27), నందిపాక హరి సాయి(50)గా గుర్తించారు. వీరిద్దరూ అవివాహితులు. ఏజెన్సీలో రెండేళ్లుగా పని చేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో సంస్థకు సంబంధించిన సరుకులను దుకాణాలకు వేసి.. ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది.

చేతికి అందివచ్చిన బిడ్డలు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. శోకసంద్రంలో మునిగినవారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. గూడూరు గ్రామీణ సిఐ శ్రీనివాసరెడ్డి, చిల్లకూరు, మనుబోలు ఎస్సైలు సుధాకర్ రెడ్డి, ముత్యాలరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో నెంబర్ ఆధారంగా మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. 

ఇదిలా ఉండగా, UttarPradeshలోని ఖుషీనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి Wedding ceremony సందర్భంగా ఉల్లాసంగా ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు wellలో పడి మహిళలు, పిల్లలతో సహా 11 మంది మరణించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, marriageలో మహిళలు, పిల్లలు పాత బావిని కప్పి ఉంచిన slabపై కూర్చున్నారు. బరువు ఎక్కువ కావడంతో స్లాబ్ కూలిపోయింది. దీంతో దానిమీద కూర్చున్న వారు బావిలో పడిపోయారు. వారిని వెంటనే బావిలో నుంచి తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే 11 మంది మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా, సరదాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏడుపులు, హాహాకారాలతో నిండిపోయింది. తమ ఆప్తులను కోల్పోయిన వారి రోదనలతో అక్కడ విషాదం అలుముకుంది. ఈ ఘటన మీద జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రాజలింగం మీడియాతో మాట్లాడుతూ, “ప్రమాదవశాత్తు బావిలో పడి 11 మంది మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు మాకు సమాచారం అందింది. వివాహ కార్యక్రమంలో కొంతమంది బావి స్లాబ్‌పై కూర్చున్నప్పుడు... అధిక లోడ్ కారణంగా, స్లాబ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది" అని తెలిపారు.

ఈ ఘటనలో మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీనియర్ అధికారి తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. తక్షణమే రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించి గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

click me!