
కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం బైపాస్‌లో రోడ్డులో రెండు భారీ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు-లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి యానాంకు 38మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు యానాంకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు నందిగామ మండలం అనాసాగరం బైపాస్ రోడ్డులో వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న బస్సు ఓ లారీని ఢీకొట్టింది.
read more ఆస్తి కోసం గొడవ.. బాబాయ్ ని చంపేసి.. తానే హత్య చేశానంటూ..!
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం గురించి ప్రయాణికుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.