మరికాసేపట్లో పెళ్లి.. మండపం నుంచి వధువు పరారీ..!

Published : Aug 26, 2021, 08:07 AM IST
మరికాసేపట్లో పెళ్లి.. మండపం నుంచి వధువు పరారీ..!

సారాంశం

ఇరుకుటుంబాల వారు మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు.  


పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండపాన్ని  అందంగా అలంకరించారు. బంధువులు, కుటుంబసభ్యులు అందరూ మండపానికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. సడెన్ గా పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 అనంతపురం జిల్లా ఎస్పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు(26), తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇరుకుటుంబాల వారు మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు.

కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. పెళ్లి కుమార్తె రాత్రికి  రాత్రే ఎవరికీ తెలియకుండా పరారైంది. దీంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. అయితే.. పెళ్లి ఆగిపోవడంతో.. తమకు అవమానం జరిగిందని.. పెళ్లి కొడుకు, బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెళ్లి కూతురు మైనర్ అని తేలడం గమనార్హం. ఒకటో పట్టణ ఎస్సై లోకేష్ దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు