తూర్పుగోదావరి: ఎదురెదురుగా వచ్చిన బైకులు ఢీ.. నలుగురు యువకులు దుర్మరణం

Siva Kodati |  
Published : Nov 14, 2021, 09:10 PM IST
తూర్పుగోదావరి: ఎదురెదురుగా వచ్చిన బైకులు ఢీ.. నలుగురు యువకులు దుర్మరణం

సారాంశం

తూర్పుగోదావరి జిల్లాలో (east godavari district) ఆదివారం ఘోర రోడ్డు (road accident) ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. 

తూర్పుగోదావరి జిల్లాలో (east godavari district) ఆదివారం ఘోర రోడ్డు (road accident) ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరం (i polavaram) కాలువ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జాగరంపల్లి గ్రామానికి (jagarampally) చెందిన కోడి రమేశ్‌, కోసు శేఖర్‌లు సీతపల్లిలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి తిరుగు పయనమయ్యారు. 

ఈ క్రమంలో గంగవరం (gangavaram) మండలం జీఎం పాలెం గ్రామానికి చెందిన చోడి రాజబాబు, పండు అనే ఇద్దరు యువకులు రంపచోడవరం (rampachodavaram) నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు ఐ.పోలవరం కాలువ వద్ద ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శేఖర్‌, రమేశ్‌, పండు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజబాబు తుదిశ్వాస విడిచారు. వీరంతా వ్యవసాయ కూలీలే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్