మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తెలుగు రాష్ట్రాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (ayyanna pathrudu) కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తెలుగు రాష్ట్రాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (ayyanna pathrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ హూ కిల్డ్ బాబాయ్ ’’ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా ’’ అని తేలిపోయింది విజయసాయిరెడ్డి (vijayasai reddy) అంటూ ట్వీట్ చేశారు. బాబాయ్‌పై జగన్ రెడ్డి గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని అయ్యన్న ఎద్దేవా చేశారు. "త్వరలోనే అప్రూవర్‌గా మారి వైసీపీని రెండుగా చీల్చి సీఎం అవ్వాలనే నీ ప్లాన్-ఏ లీకైందని అంటున్నారు. బాత్రూంలో గుండెపోటు వచ్చే లోపే విదేశాలకు జంప్ అవ్వాలనే ప్లాన్-బీ కూడా సిద్ధం చేసుకుంటున్నావటగా సాయిరెడ్డీ!" అంటూ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.
కాగా.. వివేకానందరెడ్డి (ys vivekanada reddy murder case) హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. గడిచిన కొన్ని నెలలుగా సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి (dasta giri) బాంబ్ పేల్చారు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ (confession statement) ఇచ్చారు. అందులో జగన్ సోదరుడు, కడప ఎంపీ (kadapa mp) అవినాష్‌రెడ్డి (ys avinash reddy) పేరును కూడా ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది.
ఎర్ర గంగిరెడ్డి (erra gangireddy) , సునీల్ యాదవ్ (sunil yadav), గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో (uma shankar reddy) కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
Also Read:YS Viveka case: అవినాశ్ రెడ్డిని ఇరికించే కుట్ర... ఆధారాలు బయటపెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc elections) మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటల్లేవని... కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని.. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి చెప్పారు. అయితే తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలను సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు.
ఇదే సమయంలో తన స్నేహితుడు మున్నా దగ్గర మిగిలిన రూ. 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి చెప్పారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
తమను చూసిన వివేకా నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో ఆయన వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా బెడ్‌రూమ్‌లో డబ్బు గురించి వారిద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగిందని ఆయన చెప్పారు. వివేకాను అసభ్యపదజాలంతో దూషిస్తూ మొహంపై సునీల్ యాదవ్ దాడిచేశాడని... తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాను నరికాడని దస్తగిరి వెల్లడించారు. ఆ వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ గొడ్డలితో దాడి చేసినట్లు దస్తగిరి పేర్కొన్నారు.
హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తేలిపోయింది విజయసాయిరెడ్డి. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటుని గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. త్వరలో అప్రూవర్ గా మారి వైసీపీని రెండుగా చీల్చి (1/2) pic.twitter.com/Nk0ymrsz0k
— Ayyanna Patrudu (@AyyannaPatruduC)