పోటీ విషయంలో సీరియస్ గా ఉన్నారా?

First Published Sep 2, 2017, 9:16 AM IST
Highlights
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పవన్ కల్యాణ్ నిజంగానే సీనియస్ గా ఉన్నారా అనే అనుమానలు కలుగుతున్నాయి.
  • ‘వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల సంఖ్యపై 2018 డిసెంబర్లో గానీ స్పష్టత రాదు’...ఇది...జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.
  • ముందస్తు ఎన్నికలొస్తాయని అందరు అనుకుంటున్న నేపధ్యంలో పవన్ మాత్రం తీరుబడి రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.
  • 2018 డిసెంబర్లోనే పోటీ చేయబోయే సంఖ్య తేలుతుందంటే ఏమిటర్ధం?
  •  

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పవన్ కల్యాణ్ నిజంగానే సీనియస్ గా ఉన్నారా అనే అనుమానలు కలుగుతున్నాయి. ‘వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల సంఖ్యపై 2018 డిసెంబర్లో గానీ స్పష్టత రాదు’...ఇది...జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. శుక్రవారం డిజిటల్ కార్యకర్తలతో సమావేశయమైనపుడు అనేక విషయాలు మాట్లాడారు. ముందస్తు ఎన్నికలొస్తాయని అందరు అనుకుంటున్న నేపధ్యంలో పవన్ మాత్రం తీరుబడి రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.

2018 డిసెంబర్లోనే పోటీ చేయబోయే సంఖ్య తేలుతుందంటే ఏమిటర్ధం? షెడ్యూల్ ఎన్నికలు 2019 మేలో జరగాలి. అంటే పవన్ చెప్పినదాని ప్రకారం ఓ ఐదు నెలల ముందు మాత్రమే సంఖ్యపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలొస్తే అపుడేం చేస్తారు?

ఎన్నికల్లో పోటీ చేయబోయే సంఖ్యనే ఐదు మాసాల ముందు తేలిస్తే ఇక అభ్యర్ధులను ఎప్పుడు నిర్ణయిస్తారు? వాళ్లు ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవాలి? ఒకవేళ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకిచ్చే సీట్లు ఎప్పుడు తేలుతుంది? నిజానికి జనసేన పార్టీని ప్రకటించి ఇప్పటికి చాలా కాలమే అయినా ఇప్పటి వరకూ పార్టీ నిర్మాణమే కాలేదు. మరి పార్టీ నిర్మాణాన్ని ఎప్పుడు చేస్తారు? సభ్యత్వ నమోదు ఎప్పుడు  మొదలుపెట్టి పూర్తి చేస్తారు?

అన్నీ పకడ్బందీగా చేసుకున్నాం అనుకున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినటం అందరూ చూసారు. అటువంటిది కేవలం అభిమానులు తప్ప ఇంకే బలం లేని పవన్ పార్టీ నిర్మాణం చేయకుండానే ఎలా సక్సెస్ సాధిద్దామనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఇప్పటి వరకూ పవన్ తీరికున్న సమయాల్లో మాత్రమే రాజకీయాలు చేస్తున్నారన్నది వాస్తవం. పవన్ పోకడలను చూసిన తర్వాతే జనాలు ప్రజారాజ్యం అనుభవాలను గుర్తుకుతెచ్చుకుంటున్నారు.

పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తన బలమెంతో తనకే తెలీదని చెప్పటం విచిత్రంగానే ఉంది. నిజంగా తన బలమెంతో తెలుసుకోవాలనుకునుంటే మొన్ననే జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పోటీ చేస్తే సరిపోయేది కదా? మళ్ళీ ఆ ధైర్యం చేయలేదు.

పైగా అక్టోబర్ నుండి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత గానీ తన బలంపై స్పష్టత రాదని చెబుతున్నారు. పవన్ ప్రజల్లోకి వస్తే జరిగేదేంటి? కేవలం అభిమానులు మాత్రమే ఆయన వెంటుంటారు. మరి, మిగిలిన వాళ్ళ సంగతేంటి? తాను ప్రజల్లోకి వస్తే అనేక ఇబ్బందులుంటాయని పవనే ఆమధ్య చెప్పని సంగతి గుర్తుంది కదా? దాంతో ఏమాట నమ్మాలో అర్దంకాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. వామపక్షాలతో పొత్తులు, చంద్రబాబుతో రాసుకుపూసుకు తిరగటంపై పవన్ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

click me!