దూకుడు: బాబు నివాసాన్ని కొలవనున్న రెవిన్యూ అధికారులు

By narsimha lodeFirst Published Jun 28, 2019, 12:11 PM IST
Highlights

కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ దూకుడు పెంచింది. అక్రమ కట్టడాలపై  రెవిన్యూ అధికారులు కొలతలు తీయనున్నారు.  నదికి ఎంత దూరంలో నిర్మించారనే దానిపై  సర్వేయర్లు  సర్వే నిర్వహించనున్నారు.


అమరావతి:కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ దూకుడు పెంచింది. అక్రమ కట్టడాలపై  రెవిన్యూ అధికారులు కొలతలు తీయనున్నారు.  నదికి ఎంత దూరంలో నిర్మించారనే దానిపై  సర్వేయర్లు  సర్వే నిర్వహించనున్నారు.

కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలుగా భావిస్తున్న ఇంటి యజమానులకు శుక్రవారం నాడు ఉదయం నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని  తేల్చి చెప్పారు.

సీఆర్‌డీఏ  నోటీసులు జారీ చేయడంతో  రెవిన్యూ అధికారులు కూడ రంగంలోకి దిగారు. ఇవాళ  ఉదయం రెవిన్యూ అధికారులు సమావేశమయ్యారు.నోటీసులు జారీ చేసిన  అక్రమ కట్టడాలు  కృష్ణా నదికి ఎంత దూరంలో నిర్మించారు. 

ఎంత విస్తీర్ణంలో నిర్మించారనే విషయాలపై సర్వేయర్లు కొలతలు తీయనున్నారు.చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటికి కూడ సర్వేయర్లు ఇవాళ సాయంత్రం వరకు కొలతలు తీసుకొంటారు.


 

click me!