అది చంద్రబాబు సొమ్ము కాదు.. జగన్ కి ఎక్కడిది అధికారం.. కన్నా

Published : Jun 28, 2019, 12:06 PM IST
అది చంద్రబాబు సొమ్ము కాదు.. జగన్ కి ఎక్కడిది అధికారం.. కన్నా

సారాంశం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం ప్రజా వేదిక కూల్చివేత చుట్టూ తిరుగుతోంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం ప్రజా వేదిక కూల్చివేత చుట్టూ తిరుగుతోంది. ఇటీవల జగన్ ఆదేశాల మేరకు ప్రజా వేదికను కూల్చివేశారు.

కాగా... ఈ ఘటనపై తాజాగా కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని అక్రమ కట్టడాలను కలిపే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రజావేదికను ప్రజల సొమ్ముతో నిర్మించారని... చంద్రబాబు సొమ్ముతో కాదని గుర్తు చేశారు. ఈ నిర్మాణానికి రూ.8 కోట్లు కాల్వలో పోశారన్నారు. 

ఆ వేదికను తొలగించకుండా ‘ప్రజా వైద్యశాల’కు ఉపయోగించాల్సిందన్నారు. అసలు ప్రజావేదికను తొలగించే అధికారం ఎవరు ఇచ్చారు..? అని వైఎస్ జగన్‌ను కన్నా ప్రశ్నించారు. అయితే అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు