రాహుల్ మీటింగ్ కు బ్రాహ్మణి అందుకే..: బాబుపై వైసిపి ఫైర్

By pratap reddyFirst Published Aug 23, 2018, 7:27 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో దోస్తీకి సిద్ధపడ్డారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత టిజెఆర్ సుధాకర్ బాబు అన్నారు. అందుకు నిదర్శనంగా రాహుల్ గాంధీ సమావేశానికి బ్రాహ్మణి వెళ్లడాన్ని ఆయన ప్రస్తావించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో దోస్తీకి సిద్ధపడ్డారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత టిజెఆర్ సుధాకర్ బాబు అన్నారు. అందుకు నిదర్శనంగా రాహుల్ గాంధీ సమావేశానికి బ్రాహ్మణి వెళ్లడాన్ని ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి, చంద్రబాబుకు మధ్య రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం నెరుపుతున్నారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు.

చంద్రబాబు ఇతర పార్టీలతో పెళ్లిళ్ల సంగతి నిజం కాదా? విడాకులు తీసుకుంది నిజం కాదా? చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ నేతలతో చర్చించారని ఆయన అన్నారు.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని చంద్రబాబు అన్నట్లు పత్రికల్లో వచ్చిందని ఆయన అన్నారు. 

రాహుల్‌ గాంధీ మీటింగ్‌కు బ్రాహ్మణి వెళ్లింది నిజం కాదా? ఆమె ఎందుకు వెళ్లారు? కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగానే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని, రాహుల్‌- చంద్రబాబు మధ్య రేవంత్‌ మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారని ఆయన అన్నారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారని, గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారని ఆయన అన్నారు. పార్టీకి, తనకు సిద్దాంతం అంటూ ఉండదని, గెలవడానికి ఏదైనా చేస్తారని అన్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఒంటరిగానే పోటి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టట్లేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే చంద్రబాబు దోపిడీని కక్కిస్తామని సుధాకర్‌ బాబు అన్నారు. 

click me!