వెంకయ్య కాన్వాయ్ వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలు (వీడియో)

Published : Aug 22, 2018, 11:12 PM ISTUpdated : Sep 09, 2018, 01:09 PM IST
వెంకయ్య కాన్వాయ్ వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలు (వీడియో)

సారాంశం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాన్వాయ్ లోని ఓ కారు బుధవారం రాత్రి ప్రమాదానికి గురైంది. విజయవాడలోని గన్నవర్ చైతన్య స్కూల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది


విజయవాడ:ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాన్వాయ్ లోని ఓ కారు బుధవారం రాత్రి ప్రమాదానికి గురైంది. విజయవాడలోని గన్నవర్ చైతన్య స్కూల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఉపరాష్ట్రపతి కారు వెనక వస్తున్న వాహనం ఢీ కొని ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

"

దీనితో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదం జరిపిన కారును ఆపివేశారు. పోలీసులకు, స్థానికులకు తీవ్రవాగ్వాదం జరిగింది.కృష్ణా జిల్లా  పర్యటన కోసం ఆయన ఇవాళ  విజయవాడ వచ్చారు. 

న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయం కి చేరుకున్నారు.   గన్నవరం విమానాశ్రయం లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఘన స్వాగతం పలికారు. తర్వాత  స్వర్ణ భారత్ ట్రస్టు కు వెళుతున్నపుడు కాన్వాయ్ లోని కారు ఇద్దరు చిన్నారులకు ఢీకొట్టింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?