(వీడియో) చంద్రబాబుకే ఫిట్టింగ్ పెట్టిన రేవంత్

Published : Oct 28, 2017, 04:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) చంద్రబాబుకే ఫిట్టింగ్ పెట్టిన రేవంత్

సారాంశం

చంద్రబాబునాయుడు నైతికతపై రేవంత్ ఖచ్చితంగా పెద్ద దెబ్బే కొట్టాడు. ఒకవైపేమో ఏపిలో చంద్రబాబు వైసీపీ ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కుంటూ వారిచేత రాజీనామాలు చేయించకుండానే కాలాన్ని నెట్టుకొస్తున్నారు.

చంద్రబాబునాయుడు నైతికతపై రేవంత్ ఖచ్చితంగా పెద్ద దెబ్బే కొట్టాడు. మొన్నటి వరకూ తెలంగాణాలో టిడిపికి పెద్ద దిక్కుగా, అధికార పార్టీపై పోరాటం చేయటంలో రెబల్ గా, ఫైటర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి శనివారం టిడిపితో పాటు ఎంఎల్ఏ పదవికి  కూడా రాజీనామా చేయటం నిజంగా అనూహ్యమే.  

ఒకవైపేమో ఏపిలో చంద్రబాబు వైసీపీ ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కుంటూ వారిచేత రాజీనామాలు చేయించకుండానే కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎంత డిమాండ్ చేసినా చంద్రబాబు ఏమాత్రం ఖాతరు చేయని విషయాన్ని అందరూ చూస్తున్నదే.

అటువంటిది రేవంత్ రెడ్డి పార్టీతో పాటు ఏకంగా ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేయటంతో చంద్రబాబు ఇరుక్కున్నట్లైంది. పైగా తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందచేయాల్సిందిగా ఏకంగా చంద్రబాబుకే ఫిట్టింగ్ పెట్టారు రేవంత్. దాంతో చంద్రబాబు పరిస్ధితి ‘కుడితిలో పడ్డ ఎలుక’లాగ తయారైంది. రేవంత్ రెడ్డి ఎంఎల్ఏ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపితే ఒక ఇబ్బంది. పంపకపోతే ఇంకోరకమైన ఇబ్బంది.

ఎలాగంటే, రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను ఆమోదించాల్సిందిగా చంద్రబాబు తెలంగాణా స్పీకర్ కు ఎండార్స్ చేసిన మరుక్షణం ఫిరాయింపు ఎంఎల్ఏల చేత కూడా రాజీనామా చేయించమంటూ ఎదురుదాడి చేయటానికి వైసీపీ కాచుకుని ఉంది. అలాగని రేవంత్ రాజీనామా లేఖను తన వద్దే పెండింగ్ లో పెడదామా అంటే ఎక్కువ రోజులు ఆపిపెట్టటమూ సాధ్యం కాదు. ఒకవైపు రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడుతూనే మరోవైపు అదే విలువలకు పాతరేయటంలో ఆరితేరిపోయిన చంద్రబాబుకే పోతూ పోతూ రేవంత్ భలే ఫిట్టింగ్ పెట్టారు.

 

PREV
click me!

Recommended Stories

ఒకేఒక్కడు సీన్ రిపీట్ | CM Chandrababu Sudden Entry In Panchayat Office | Asianet Telugu
Ambati Rambabu Pressmeet: ఏపీ కేబినెట్ మీటింగ్పై ప్రెస్ మీట్ లో అంబటి సెటైర్లు