రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ సోదరుడు రాజశేఖర జోషీ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులే అతడిని అరెస్ట్ చేశారని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్; రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ సోదరుడు ఓఎన్‌జీసీ ఉద్యోగి Penumaka Rajashekara joshi అదృశ్యం కలకలం రేపుతోంది. రాజశేఖర జోషిపై ఆయన భార్య Sandhya గృహహింస కేసు పెట్టింది. ఈ కేసులో ప్రాథమిక విచారణకు హాజరుకావాలని Notice ఇవ్వడానికి Vijayawada పటమట పోలీసులు శుక్రవారం నాడు ఆయన ఇంటికి వెళ్లారు. విజయవాడలోని క్రీస్తు రాజపురంలో రాజశేఖర్ జోషీ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండడం కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ బయటకు రాకపోవడంతో తిరిగి వచ్చేశామని పటమట పోలీసులు చెబుతున్నారు.
కానీ పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత నుంచే జోషి కనిపించడం లేదని వారే అరెస్టు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, జోషిని తాము అరెస్టు చేయలేదని పోలీసులుచెబుతున్నారు. అయితే రాజశేఖర జోషీ అదృశ్యం కావడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.రాజశేఖర్ జోషి,సంధ్య దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి సమయంలో రూ. 2 లక్షల కట్నం, నాలుగు ఎకరాల మామిడి తోట, కారుతో పాటు ఇంటికి సంబంధించిన వస్తువులను అందించినట్టుగా జోషీ భార్య సంధ్య పోలీసులకు గతంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే అదనపు కట్నం కోసం రాజశేఖర్ జోషి తమను వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధ్య ఫిర్యాదు మేరకు విజయవాడ పటమట పోలీసులు రాజశేఖర జోషిపై కేసు నమోదు చేశారు. రిటైర్డ్ IAS అధికారి PV Ramesh తల్లిదండ్రులకి ఈ ఏడాది జనవరి 19న విజయవాడ పటమట నోటీసులు ఇచ్చారు. తొలుత ఈ నోటీసులను ఏపీ సీఐడీ పోలీసులు ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. కానీ సీఐడీ పోలీసులు మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని తేల్చి చెప్పారు.
undefined
Vijayawada పడమట పొలిసు స్టేషన్ లో నమోదైన కేసు లో నోటీసులు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారని సీఐడీ అధికారులు తెలిపారు. 2018 పీవీ రమేష్ తమ్ముడి భార్య గృహ హింస కేసులో నిందితులుగా పీవీ రమేష్ తల్లి తండ్రులున్నారని సీఐడీ అధికారులు చెప్పారు. ఈ విషయమై 2018 లో కేసు నమోదైంది. తనకు ఈ నోటీసులతో ఎలాంటి సంబంధం లేదని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తేల్చి చెప్పారు.
తనపై పీవీ రమేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సునీల్ కుమార్ చెప్పారు.ఈ నోటీసులు అందుకొన్న తర్వాత పీవీ రమేష్ పేరేంట్స్ సునీల్ కుమార్ పై ఆరోపణలు చేశారు. తమ కుటుంబాన్ని సునీల్ కుమార్ వేధింపులకు గురి చేస్తున్నారని మీడియాకు చెప్పారు. అయితే ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు రాజశేఖర జోషి కన్పించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అంతకుముందు స్కిల్ డెవలప్ మెంట్ కేఃసులో కూడా పీవీ రమేష్ కు నోటీసులు ఇవ్వడానికి ఏపీ సీఐడీ అధికారులు ప్రయత్నించారు. హైద్రాబాద్ లోని ప్రశాసన్ నగర్ ఇంటికి వచ్చారు. అయితే ఆ ఇంటిని పీవీ రమేష్ డెవలప్ మెంట్ కు ఇవ్వడంతో సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వకుండా వెళ్లారు. పీవీ రమేష్ కు కొరియర్ ద్వారా నోటీసులు పంపుతామని పోలీసులు తెలిపారు.