కర్నూల్ లో దారుణం: పిన్నితో వివాహేతర సంబంధం...అడ్డుగావున్నాడని బాబాయ్ ని చంపిన అబ్బాయ్

Arun Kumar P   | Asianet News
Published : Feb 06, 2022, 09:28 AM IST
కర్నూల్ లో దారుణం: పిన్నితో వివాహేతర సంబంధం...అడ్డుగావున్నాడని బాబాయ్ ని చంపిన అబ్బాయ్

సారాంశం

మానవ సంబంధాలకు మచ్చలాంటి ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. సొంత పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకున్న  ఓ యువకుడు బాబాయ్ ని అతికిరాతకంగా హతమార్చాడు.

కర్నూల్: కేవలం క్షణకాలం శారీరక సుఖం కోసం కొందరు వావివరసలు మరిచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. మానవ సంబంధాలకు మచ్చలాంటి అనేక ఘటనలు ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్నాయి. ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని చంపుతున్న భార్యలు, అనుమానంతో  భార్యను చంపుతున్న భర్తల గురించి నిత్యం వార్తల్లో వస్తూనే వున్నాయి. తాజాగా అలాంటి దారుణమే కర్నూల్ జిల్లా (kurnool district)లో ఏడాది క్రితం చోటుచేసుకోగా తాజాగా అసలునిజం వెలుగుచూసింది.  

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్కా జయలక్ష్మి(37), కిష్టయ్య(40) భార్యాభర్తలు. వంశపారంపర్యంగా సంక్రమించిన కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కిష్టయ్య కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ పెళ్లయి 20ఏళ్లయినా భార్యభర్తలు హాయిగా జీవించేవారు. 

అయితే కిష్టయ్య సొంత అన్నకొడుకు చింతలయ్య నీచపు ఆలోచన భార్యభర్తల మధ్య విబేధాలను సృష్టించింది. సొంత పిన్ని జయలక్ష్మిపై చింతలయ్య కన్నేసి మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. ఇలా పిన్నితో కొంతకాలం రాసలీలలు కొనసాగగా ఈ విషయం కిష్టయ్యకు తెలిసింది. అయితే కుటుంబ పరువును బజారున పడేయకూడదని భావించిన అతడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ భార్యతో పాటు అన్నకొడుకును గట్టిగా హెచ్చరించాడు. 

ఇలా కిష్టయ్యకు తమ అక్రమ బంధం (illegal affair) గురించి తెలియడంతో పిన్ని అబ్బాయ్ దారుణ నిర్ణయం తీసుకున్నారు. తమ బంధానికి అడ్డుగా వున్న అతడి అంతమొందించాలని చింతలయ్య కొందరు మిత్రులతో కలిసి పథకం రచించారు. కిష్టయ్యకు ఈత రాదు కాబట్టి అతడికి నీటిలో పడేసి ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. ఈక్రమంలోనే  2020 సెప్టెంబర్ 19న నందిపల్లె గ్రామ శివారులోని పాలేరు వాగు వంతెనపై బైక్‌మీద వెళ్తున్న బాబాయ్ కిష్ణయ్యను చింతలయ్య అడ్డుకున్నాడు. అతడితో ఏదో మాట్లాడుతుండగా వెనకనుండికొందరు వచ్చి  కిష్టయ్యను వాగులో పడేసారు. దీంతో నీటమునిగి అతడు మరణించాడు.

ఆ తర్వాత చింతలయ్య తనకేమీ తెలియదన్నట్లుగా వుండిపోయాడు. జయలక్ష్మి తన భర్త కనిపించడం లేదని కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే  చెరువులో కిష్టయ్య మృతదేహం లభించింది. అతడికి ఆత్మహత్యా లేక ఏదయినా ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

అయితే నెలలు గడుస్తున్నా కిష్టయ్య మరణానికి గల కారణమేంటో పోలీసులకు తెలియలేదు. ఈ క్రమంలోనే మృతుడి భార్య జయలక్ష్మి, చింతలయ్య ప్రవర్తన తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది.దీంతో చింతలయ్యను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారణ జరపగా హత్య తానే చేసినట్లు అంగీకరించాడు. పిన్నితో అక్రమసంబంధం నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. అతడు తెలిపిన వివరాలతో మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే జయలక్ష్మి మాత్రం పరారీలో వున్నట్లు... ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు