విశాఖకు ఏలూరు తరహా ముప్పు: జగన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ హెచ్చరిక

By Siva KodatiFirst Published Dec 10, 2020, 10:51 PM IST
Highlights

విశాఖకు ఏలూరు తరహా ముప్పు పొంచి ఉందంటు సంచలన వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ. విశాఖలో నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. 

విశాఖకు ఏలూరు తరహా ముప్పు పొంచి ఉందంటు సంచలన వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ. విశాఖలో నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.

విశాఖ పాటు పట్టణాల్లో మంచినీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని.. మంచినీటి వనరులు, పైపులైను వ్యవస్థలు, పైపులైన్లకు వినియోగించే పైపుల నాణ్యత అంశాలన్నీ నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని శర్మ తన లేఖలో ప్రస్తావించారు.

ఏలూరులో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈఏఎస్ శర్మ.. సీఎంతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలకు ఈ-మెయిల్‌లో లేఖలు పంపారు. దేశంలోని 26 నగరాల్లో మోతాదుకు మించిన సీసంతో కలుషితమైన నీరే సరఫరా అవుతోందని ‘క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ (క్యూసీఐ) చేసిన అధ్యయనంలో తేలిందని తెలిపారు.

మున్సిపాలిటీలు / నగరపాలక సంస్థల్లో సీసం పూతతో తయారైన పైపుల వినియోగం కూడా నీరు విషతుల్యం కావడానికి కారణం అంటున్నారని శర్మ వివరించారు. కాలుష్యానికి కారణమతున్న అంశాలపై లోతైన దర్యాప్తు చేయించాలని సీఎం జగన్‌ను ఆయన కోరారు.

click me!