కొత్తగా 538 మందికి పాజిటివ్: ఏపీలో 8,73,995కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 10, 2020, 07:18 PM ISTUpdated : Dec 10, 2020, 07:23 PM IST
కొత్తగా 538 మందికి పాజిటివ్: ఏపీలో 8,73,995కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 538 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 538 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,73,995కి చేరింది. కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీరితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 7047కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలో 5,237 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,61,711కి చేరింది. గత 24 గంటల్లో 64,354 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో 1,06,35,197కి చేరుకుంది.

నిన్న అనంతపురం 14, చిత్తూరు 95, తూర్పుగోదావరి 50, గుంటూరు 72,  కడప 86, కర్నూలు 18, నెల్లూరు 24, ప్రకాశం 35, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 31, విజయనగరం 7, పశ్చిమ గోదావరిలలో 72 కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!