దేశ మాత సేవలో అమరుడైన తెలుగు జవాన్

Siva Kodati |  
Published : Dec 10, 2020, 10:27 PM ISTUpdated : Dec 10, 2020, 10:28 PM IST
దేశ మాత సేవలో అమరుడైన తెలుగు జవాన్

సారాంశం

దేశ రక్షణ విధుల్లో తెలుగు బిడ్డ అమరుడయ్యాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన షేక్. హాజి హుస్సేన్ ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్‌ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు

దేశ రక్షణ విధుల్లో తెలుగు బిడ్డ అమరుడయ్యాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన షేక్. హాజి హుస్సేన్ ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్‌ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నీలం యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తున్న హుస్సేన్ గురువారం సాయంత్రం మరణించారు. మృతుడు హాజి హుస్సేన్‌కు వచ్చే నెలలో వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిశ్చయించారు.

ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన తండ్రి షేక్‌ మహబూబ్, తల్లి షకీలా బేగంలకు ఫోన్ చేసిన హాజి హుస్సేన్ డిసెంబర్ 15న తన మేనమామ వివాహానికి వస్తానని చెప్పాడు. ఆ సమయంలో తాను మోకాలి లోతు మంచులో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu